మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పలాసలో పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన కుమారుడు ఆరవ్ పాల్గొన్న రోడ్డు ప్రమాదం కేసు నుంచి అతడిని తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత కేసు నుండి తన కుమారుడిని రక్షించేందుకు, ఆధారాలను మరియు సాక్ష్యాలను తారుమారు చేయడానికి అప్పలరాజు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి అప్పలరాజు కుమారుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం తదుపరి విచారణ నిమిత్తం అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Tag: