శ్రీకాకుళం నగర శివార్లలోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన పాఠశాల నిబంధనలను విస్మరిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం స్కూల్ బస్సులు హైవేపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాయని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఉల్లంఘనలు జరుగుతున్నా, అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇక ఈ పాఠశాలకు సరైన ప్రభుత్వ అనుమతులు లేవన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా అడ్మిషన్లు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు అంటున్నారు..జిల్లా విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి స్కూల్‌పై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Tag:





Total views : 199091