ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. జ్యోతిరావ్ ఫూలే భవన్లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క రోజు పాల్గొన్నారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నారని తెలిపారు. చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించకపోవడం వల్లే ఇలా పిలుచుకుంటున్నారని దెప్పి పొడిచారు. కచ్చితంగా వందరోజులు ఓపిక పడుతామని, వందరోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని అన్నీ లోపాలను, లొసుగులను తప్పకుండా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో రేవంత్‌కు ఏమాత్రం పోలిక లేదని కవిత తెలిపారు. ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని కెసిఆర్ కోరుకునే వారని… నేడు రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ చూపిన మార్గంలో నడుస్తుండటం సంతోషదాయకమని కవిత అన్నారు.
sports
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రోడ్డు రవాణా శాఖ భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీన ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలను.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు RTO ఆఫీసులో ఆయన రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని.. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రాజా గోపాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, ట్రైని డీఎస్పీ హేమంత్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో..బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు. ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల.. ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు.
తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు. అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్సి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరివేపాకు వంటకాల్లో ఒక సాధారణ పదార్థం. కానీ ఇది వంటకాల్లో రుచిని ఇవ్వటమే కాకుండా, జుట్టు ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పని చేస్తుంది. కరివేపాకులో విటమిన్ సి, బి, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను పోషించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కరివేపాకులోని బీటా కెరోటిన్ జుట్టుకు అవసరమైన విటమిన్ ఎ గా మార్చబడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. కరివేపాకులోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సెలీనియం వంటి ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. కరివేపాకులోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు మరియు తలలో పురుగులను నివారిస్తాయి.
కరివేపాకును జుట్టు పెరుగుదల కోసం ఎలా ఉపయోగించాలి:
కరివేపాకు ఆకులను నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత పేస్ట్ చేసి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. కరివేపాకు ఆకులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత నూనెను జుట్టుకు పట్టించి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయండి. కరివేపాకు ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటితో తలస్నానం చేయండి. ఇలా చేయటం ద్వారా జుట్టు పెరుగుదల పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బలంగా మరియు మెత్తగా మారుతుంది. చుండ్రు మరియు తలలో పురుగులు తగ్గుతాయి. కరివేపాకు ఒక సహజమైన మరియు సురక్షితమైన పదార్థం. దీనిని ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించవచ్చు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మైక్రో శాటిలైట్ల కోసం హైబ్రిడ్ ఎలక్ట్రో-థర్మల్ ప్రొపల్షన్ (HET) సిస్టమ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ సిస్టమ్ డీఆర్డీవో అభివృద్ధి చేసిన మొదటి పర్యావరణ అనుకూల ప్రొపల్షన్ సిస్టమ్.
HET సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ సిస్టమ్ హైడ్రజన్ మరియు ఆక్సిజన్‌ను ఉపయోగించి థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంధనాలు పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను ఉత్పత్తి చేయవు. HET సిస్టమ్ చాలా సమర్థవంతమైనది మరియు సాంప్రదాయ ప్రొపల్షన్ సిస్టమ్‌ల కంటే ఎక్కువ డెల్టా-Vని అందిస్తుంది.
HET సిస్టమ్ యొక్క ప్రయోజనాలు:
ఇది పర్యావరణ అనుకూలమైనది మరియు సమర్థవంతమైనది. ఇది సాంప్రదాయ ప్రొపల్షన్ సిస్టమ్‌ల కంటే ఎక్కువ డెల్టా-Vని అందిస్తుంది. ఇది మైక్రో శాటిలైట్లను భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి చౌకైన మార్గాన్ని అందిస్తుంది. HET సిస్టమ్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది మైక్రో శాటిలైట్లను ప్రయోగించడానికి భారతదేశ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు అంతరిక్షంలో భారతదేశ పాత్రను బలోపేతం చేస్తుంది.
ఈ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు!
గొప్ప వార్త! భారతీయ పర్యాటకులు ఇప్పుడు ఈఫిల్ టవర్ టిక్కెట్లను రూపాయల్లో చెల్లించవచ్చు. ఈ సౌకర్యం 2023 డిసెంబర్ 1 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈఫిల్ టవర్ యొక్క అధికారిక వెబ్సైట్లో లేదా టిక్కెట్ కౌంటర్ల వద్ద టిక్కెట్లను రూపాయల్లో కొనుగోలు చేయవచ్చు. చెల్లింపు UPI, Paytm, PhonePe, Google Pay వంటి భారతీయ చెల్లింపు పద్ధతుల ద్వారా చేయవచ్చు. టిక్కెట్ ధరలు ప్రస్తుత మారక రేటు ప్రకారం రూపాయల్లో లెక్కించబడతాయి తద్వారా భారతీయ పర్యాటకులకు టిక్కెట్లను కొనుగోలు చేయడం సులభతరం అవుతుంది. వారికి విదేశీ మారకం కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది భారతీయ పర్యాటకులకు ఈఫిల్ టవర్‌ను సందర్శించడానికి ఎంతో సౌకర్యాన్ని చేకూరుస్తుంది. ఈ సౌకర్యం భారతీయ పర్యాటకులకు ఒక గొప్ప ప్రయోజనం. ఇది ఫ్రాన్స్ పర్యటనను మరింత సులభతరం చేస్తుంది.
హైదరాబాద్, ఉప్పల్ పీస్ పరిధి పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సైకిళ్లు ఇతర సామాగ్రి చోరి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇళ్లలోకి దర్జాగా గేటు తీసుకొని ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరలొ రికార్డ్ అయ్యాయి. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు.
ఏలూరు, దెందులూరు(Dendulur)లో నేడు సిద్దం బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. సిద్దం సభ(Siddam Sabha)కు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న సభ. సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు సభకు హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా హాజరుకానున్న పార్టీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరొకసారి అధికారం చేపట్టేందుకు కార్యకర్తలకు సిద్ధం సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్. చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్ళించిన పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90023