అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లలో ఆందోళన రేకెత్తించాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్లు నష్టపోయి 80 వేల 239 వద్ద స్థిరపడింది. ఇది సెప్టెంబర్ 2025 తర్వాత సెన్సెక్స్ నమోదైన కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. నిఫ్టీ కూడా313 పాయింట్లు కోల్పోయి 24 వేల 866 వద్ద ముగిసింది. మార్కెట్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతూ.. కొన్ని షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా.. మరికొన్ని షేర్లు నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచాయి. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలోనూ ఒత్తిడి కనిపించింది. అయితే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మాత్రం 0.24 శాతం లాభపడి సానుకూలంగా ముగిసింది. ప్రస్తుత మార్కెట్ సరళిపై నిపుణులు స్పందిస్తూ.. నిఫ్టీకి 24 వేల 600 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని తెలిపారు. ఈ స్థాయిని కోల్పోతే మార్కెట్లు మరింత పతనం అయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఎగువన 25 వేల పాయింట్ల వద్ద నిరోధం ఉందని, నిఫ్టీ ఆ స్థాయి పైన స్థిరపడే వరకు బేర్స్ ఆధిపత్యం కొనసాగవచ్చని విశ్లేషించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీల కంటే ఎక్కువగా నష్టపోయాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారని, లాభాల స్వీకరణ వైపు చూస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Tag:
#stockmarket
అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందనే భయాలతో దలాల్ స్ట్రీట్ రక్తసిక్తంగా మారింది. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ క్లోజింగ్ నాటికి 1237 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో 1450 పాయింట్లకు పైగా పడిపోయిన సూచీ చివరి నిమిషం కొంత తేరుకుని 1 శాతానికి పైగా నష్టాల్లోనే క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ కూడా 365 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 955 పాయింట్లు పడిపోయాయి. ఇవాళ ఒక్కరోజునే మదుపర్ల సంపాదన దాదాపు 8 లక్షల కోట్లు ఆవిరయింది. అమెరికా మిలిటరీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని.. ఈవారమే దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది.