భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
- ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
- ఇరాన్‌పై అమెరికా రెండో విడత దాడులు.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం మరో విడత భారీ దాడులను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 212498