తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. సీపీఐ, సీపీఎం, VCK పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న టీవీకే అధినేత విజయ్.. చిన్న పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే TVKకు మద్దతిచ్చేందుకు వామపక్షాలతో పాటు, వీసీకే సమ్మతించినట్లు సమాచారం. దీంతో విజయ్ మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ రెండు చోట్ల గెలవడం వల్ల ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీవీకే బలం 107 మాత్రమే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 112కు చేరింది. తాజాగా వీసీకే రెండు, సీపీఐ రెండు, సీపీఎం రెండు పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 118కి చేరింది. చివరగా ఒక్క సీటు ఉన్న DMDK మద్దతు ఇవ్వడంతో విజయ్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య119కి పెరిగింది.





Total views : 75046