కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీ కు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పంతం నానాజీ జనాసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు. పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం ,సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కర్రేడ్ల గోవింద్, తడాల అబ్బు, కుర్ర నాగేశ్వరరావు, పుల్ల శ్రీరాములు, మాదరపు తాతాజీ, సిరంగు శ్రీనివాసరావు, తాటికాయలు వీరబాబు, సోదే ముసలయ్య జనసేన కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Tdp
State Vishwa Brahmin Empowerment Committee :
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం టిడిపి జనసేన మరియు బిజెపి పార్టీల కలయికతో బీసీ సాధికార కమిటీ కింద బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సమావేశమును డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు డాక్టర్ చింతాడ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు కార్పొరేషన్ మరియు బిసిఏ కులస్తులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నా టిడిపి హయాంలో బీసీలకు కావాల్సిన పది ఎకరాల భూమిలో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర కోఆర్డినేటర్ కనకాచారి అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో విశ్వబ్రాహ్మణులకు, చేతి వృత్తిదారులకు, స్వర్ణకారులకు అనేక రకాల పరికరాలు అందించిన ఘనత ప్రభుత్వానికి దొరుకుతుంది అని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బీసీ ప్రాతిపదికన మాకు మాకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకుగాను సుమారు 15 నుండి 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు టిడిపికి మద్దతునిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీని అదా పాతాళానికి తొక్కటమే మా లక్ష్యం అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో బీసీలకు గుర్తింపు పరువైందని స్వర్ణకారులకు శిల్ప గార్లకు వేద పండితులకు అనేక రకాల ఆదరణ పథకాలు కింద వచ్చిన పరికరాలను తుప్పు పట్టించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. బొమ్మల తయారీదారులకు అటవీ శాఖ వారి నుండి ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉచితంగా కల్పన అందించాలని శిల్పకారులకు దేవాలయాలపై ఉండే శిల్పాలు ఏర్పాటు కూడా రాతిని ఉచితంగా అందించాలని స్వర్ణకారులకు ముడిసరికైన బంగారం అనుకూలమైన సబ్సిడీ ధరలకు అందించాలని విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు రాష్ట్ర కోఆర్డినేటర్ సింహాద్రి కనకాచారి, రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, కృష్ణా జిల్లా కన్వీనర్ శివకోటి రాజేంద్ర ప్రసాద్, మానేపల్లి బ్రహ్మాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టిడిపి సీనియర్ నాయకులు ఎల్లగొందల రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక నాయకులు పెట్ల కామేశ్వరరావు మరియు డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అనంతపురం(Anantapur) జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం
రాయదుర్గం వైసీపీ సమన్వయ కర్త మెట్టు గోవిందరెడ్డి(Mettu Govindareddy) సొంతూరు బొమ్మనహాల్ మండలం ఉంతకల్లుకు చెందిన 65కుటుంబాల వారు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పసుపు కండువాలతో వారికి స్వాగతం పలికారు. వెనుకబడిన తరగతులకు చెందిన కురుబ, వాల్మీకి సామాజిక వర్గాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వీరితో పాటు అదే మండలం కురువల్లి నుంచి 50మంది, బొమ్మనహాల్ నుంచి 10మంది, ఎల్బీనగర్ నుంచి 5గురు, సిద్ధరాంపురం నుంచి 5గురు టీడీపీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, మెట్టు గోవిందరెడ్డి సొంత మండలంగా చెప్పుకునే బొమ్మనహాల్ నుంచే పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి వలస వస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ వలసలు మరింత పెరిగి ఆ మండలంలో మెట్టుకు డిపాజిట్ కు సరిపడా ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం (Doan constituency)లో కొండపేట లో 9, 10, 11,12, వార్డులలో పది ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) పెట్టినటువంటి మ్యానిఫెస్టోలో పథకాల గురించి ప్రజలకి వివరిస్తున్న కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి (Kotla Jaya Surya Prakash reddy) మీ ఓటు సైకిల్ గుర్తుకు వేసి డోన్ లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే అయితే అభివృద్ధి ఏందో ఇప్పుడున్న మినిస్టర్ కు చేసి చూపిస్తా అని కోట్ల తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయితే పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు తెలియజేశారు. ఒక ఓటు ఒక ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)కి ఏసి మన రాష్ట్రంని అంధకారంలోకి తీసుకుపోయారు. అందుకే ఈసారి మనం జగన్ మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడుని మన రాష్ట్రానికి సీఎం చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మన రాష్ట్రంలో రాజధాని కూడా ఏర్పాటు చేసుకోవడానికి శ్రమించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బోయిన్ పల్లి శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలులో బీసీమంత్రి చెల్లుబోయిన వేణు (chelluboyina venu) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు, టీడీపీ నేత వాసంశెట్టి శుభాష్. మంగళగిరిలో జనసేన (Janasena) – టీడీపీ(TDP) ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావటంపై, వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది అన్నారు. జయహో బీసీ (Jayaho BC) సభ విజయవంతం పై బీసీ శాఖ మాత్యులు వేణు మాట్లాడుతూ… టీడీపీ పార్టీని ఎవరు నమ్మరు అని, ఆ పార్టీ వంచన చేస్తుందని అనడం జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆయనకు ఒకటి చెప్తాను సూటిగా అయ్యా మీరు బీసీ సంక్షేమ మంత్రిగా చేస్తున్నారు. మరి మీ సొంత సామాజికవర్గం శెట్టిబలిజ సామాజికవర్గం వారికి గానీ, అందులో కులవృత్తులు లో ఉన్నవారికి గానీ, ఈ ఐదు సంవత్సరాలులో మీరు ఏమి చేశారని అన్నారు. మీ సొంత కులన్నే మీరు విస్మరించారు. మరి ఈ విషయాల గురించి మీరు ఇలా ఎలా మాట్లాడతారు, మీరే చెప్పుకుంటూ వస్తున్నారు అని ఎద్దేవా చేశారు. పాతతరం నాయకుల గా విమర్శించడానికి కూడా ఏమి లేక ఆ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారు మీరు. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా 34% నుంచి 24% తీసుకొచ్చిన ఘనత వైసీపీ పార్టీది అని అన్నారు.
ఇది చదవండి: వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని గురువారం నారా భువనేశ్వరి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ముందుగా గ్రామంలో నారా భువనేశ్వరి కి టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వడ్డే ఆంజనేయులు(vadde anjaneyulu) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) మాట్లాడుతూ…
వచ్చే ఎన్నికలలో ఓటు హక్కు ప్రాధాన్యత గుర్తుపెట్టుకుని వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు కోరారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ అని నాయకుడు అంటే చంద్రబాబు అని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గుంతకల్ నియోజకవర్గం ఇన్చార్జి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్, టీడీపీ డాక్టర్ సెల్ పత్తి హిమబిందు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది చదవండి: వేములవాడ రాజన్న ప్రసాదం ఏర్పాట్లు..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో జరిగే శంఖారావం యాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలికిన ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ వెంట పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన హిందూపురంకి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రముఖ ప్రసిద్ధి సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా లోకేష్. వేద పండితుల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూపురంలో నారా లోకేష్ కి అడగడగున ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 10 గంటలకు హిందూపురం పట్టణం కొల్లకుంట గ్రామంలో జరిగే శంఖారావం యాత్రలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. పార్టీ క్యాడర్ ను, నేతలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టారు నారా లోకేష్. కార్యకర్తలు, నాయకులతో సమావేశమై టిడిపి అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నాము అనే అంశాలపై వివరించనున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టిడిపి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్ టిడిపి ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నారా లోకేష్ హిందూపురం బయలుదేరి వెళ్లారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అతిధి గృహంలో బస చేయనున్న నారా లోకేష్ గురువారం ఉదయం హిందూపురం జిటిఎం లే అవుట్, లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందనలు తెలియజేయునన్నారు. పదిన్నర గంటలకు శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 10:56 నిమిషాలకు పార్టీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. 11.26 పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్లను అందజేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఐదు గంటలకు పెనుగొండకు చేరుకుని ఐదున్నర గంటలకు శంఖారావం సభలో ప్రసంగించనున్నారు. 6 గంటలకు పార్టీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరున్నర గంటలకు రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ సమావేశం రసాభాస గా సాగింది. ముందుగా మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా మున్సిపల్ నిధులపై టిడిపి కౌన్సిలర్ దయసాగర్, వైసిపి కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ మధ్య మాటల యుద్ధం సాగింది. టీడీపీ కౌన్సిలర్ దయసాగర్ మాట్లాడుతూ మున్సిపల్ నిధుల్లో నాలుగు కోట్లు నిధులు ఉండగ వాటిని ఇష్టానుసారంగా వాడడంతో ప్రస్తుతం నిధులు లేకపోగా మున్సిపల్ స్టేషనరీ, వాటర్ క్యాన్లు కొనే పరిస్థితిలో కూడా మున్సిపాలిటీ లేకపోవడం దారుణం అన్నారు. ఆ నిధులన్ని ఎక్కడికి వెళ్లాయి అంటూ మున్సిపల్ కమిషనర్ ను అడగగా దానికి వైస్ చైర్మన్ నజీరామత్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలను సాగాయి దీంతో మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశాన్ని ముగించారు. దింతో కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి టిడిపి కౌన్సిలర్లు మాట్లాడాలని అనుకున్న వైసిపి కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని, వారి వైఖరిని నిరసిస్తూ కౌన్సిల్ సమావేశంలోనే నేలపై బైఠాయించి అజెండా కాపీలను చింపుతూ టీడీపీ కౌన్సిలర్ లు నిరసన వ్యక్తం చేశారు.
దామినేడు ఇందిరమ్మ సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కు వినతి పత్రం అందజేశారు. దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు గోడలకు సున్నాలు కాదు మౌలిక వసతులు కల్పించాలని పులి వర్తి సుధా రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల మీ ఇంటి వద్దకే మీ నాని కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి నాని, స్థానిక సమస్యలకు చలించి సొంత నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో వ్యర్ధాలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలను, మౌలిక వసతులను పరిష్కరించకుండా, గోడలకు సున్నాలు వేసేందుకు, సుమారు 7.5 కోట్లు నిధులను మంజూరు చేసి, తన వర్గీయులకు టెండర్లు అప్పగించారని చెప్పారు. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కనపడలేదని చెప్పారు. ముఖ్యంగా దామినేడు ఇందిరమ్మ ఇళ్లు వద్ద డ్రైనేజీ నీరుతో త్రాగు నీరు కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు అనుసరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు సమస్యలకు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో స్థానికులతో కలిసి సమస్యలను పరిష్కరించేంతవరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.