ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం, 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది ఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది. భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది. ఆ తర్వాత సైన్యంలోకి దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దీన్ని ప్రవేశపెట్టారు. తాజాగా పరీక్షించిన ప్రళయ్ ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. సూర్యుడిపై పరిశోధనలు, భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ప్రళయ్ 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500- 1,000 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. చైనా, పాకిస్థాన్ వెంబడి సరిహద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ‘ఇస్కాండర్’ క్షిపణి తరహాలో ఇది ఉంటుంది.
Technology
యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారా..? క్యాప్షన్స్ ఇలా యాడ్ చేయండి..
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ చేరువైన తర్వాత కంటెంట్ క్రియేషన్ అనేది పాపులర్ ప్రొఫెషన్‌గా మారింది. ఇప్పుడు చాలామంది ఫుడ్ టూర్స్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోలు, జనరల్ వ్లాగ్స్ చేస్తూ, వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా గుర్తింపుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చేసిన వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి భాష అవరోధంగా మారకూడదు. అందుకే వీడియోలకు సబ్‌టైటిల్స్, క్యాప్షన్స్ తప్పకుండా యాడ్ చేయాలి. ఇందుకు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ తెలుసుకుందాం. యూట్యూబ్ క్యాప్షన్స్ ప్రాధాన్యతను వివరించింది. ‘మీరు వీడియోలు చేయడానికి ముందు స్క్రిప్ట్ రెడీ చేస్తే, క్యాప్షన్స్ సింపుల్‌గా యాడ్ చేయవచ్చు. మీరు ‘ఆటో సింక్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే, వీడియోలో పేర్కొన్న పదాలను ఇన్పుట్ చేయగల ఒక టూల్ పని ప్రారంభిస్తుంది. వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియో, క్యాప్షన్స్ ఆటోమెటిక్‌గా సింక్రనైజ్ అవుతాయి’ అని యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. దీంతో లాంగ్వేజ్ ద్వారా యూజర్లు కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోగలరు. యూట్యూబ్ వీడియోలకు క్యాప్షన్ యాడ్ చేసే ప్రాసెస్. స్టెప్ 1 ముందు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో సైన్ ఇన్ అయ్యి, కొత్త వీడియోను అప్లోడ్ చేయండి. స్టెప్ 2 వీడియో డీడేల్స్ ఇన్పుట్ చేసిన తర్వాత, న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందుతో సబ్‌టైటిల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. స్టెప్ 3 ఇప్పుడు “యాడ్ సబ్‌టైటిల్స్” ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత అప్లోడ్ ఫైల్, ఆటో సింక్, టైమ్ మాన్యువల్లీ వంటి ఆప్షన్స్ లిస్ట్ కనిపిస్తుంది. స్టెప్ 4 ఇక్కడ ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. వీడియో ప్రాసెస్ అయిన తర్వాత, వాటిని నేరుగా యూట్యూబ్ స్టూడియోలో ఎడిట్ చేసుకోవచ్చు. స్టెప్ 5 ట్రాన్స్క్రిప్ట్ను ఇన్పుట్ చేసిన తర్వాత “అసైన్ టైమింగ్స్” ఆప్షన్ సెలక్ట్ చేయండి. ఇది సెట్ అయిన తర్వాత, ప్రతిదీ ఒక ఆర్డర్లో ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. దీంతో మీ కంటెంట్, క్యాప్షన్స్తో సహా అప్లోడ్ అవుతుంది. యాడ్ బ్లాకర్స్‌కు చెక్ మరోవైపు, యూట్యూబ్ యాడ్ బ్లాకర్స్‌కు చెక్ పెడుతోంది. వీటి సాయంతో ఇప్పటి వరకు యాడ్స్ లేకుండా, ఉచితంగా వీడియోలు చూడటం సాధ్యమైంది. కానీ కంపెనీ వీటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. యాడ్ బ్లాకర్స్ వాడుతున్న యూజర్లు, వాటిని డిసేబుల్ చేస్తేనే యూట్యూబ్‌ను యాక్సెస్ చేయడం వీలవుతుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలంటే, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లేదంటే ఫ్రీగా వీడియోలు చూసేవారికి యాడ్స్ డిస్ప్లే అవుతాయి.
ఇండియాలోనే లాప్టాప్ల తయారీ దిశగా ఇంటెల్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం 8 స్థానిక కంపెనీలతో జత కట్టింది. ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లోనే లాప్టాప్ల తయారీని ప్రోత్సహించనుంది. ఈ క్రమంలో.. భారత్‌లోని ఎనిమిది స్థానిక కంపెనీలతో జత కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్), ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్చరర్లతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌ల తయారీకి అవసరమైన టెక్నాలజీని ‘ఇంటెల్’ షేర్ చేసుకుంటుంది. అంతే కాకుండా.. ల్యాప్‌టాప్‌ల తయారీలో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్ట్ బెంచ్ మార్క్ కాపాడే విషయంలోనూ అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. తద్వారా ‘మేకిన్ ఇండియా’ప్రాజెక్టుకు ఇంటెల్ మరింత ఊతమివ్వనుంది. ఇంటెల్ సంస్థతో జత కట్టిన దేశీయ కంపెనీల్లో.. భగవతీ ప్రొడక్ట్స్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్, పనాచే డిజిటల్ లైఫ్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, వీవీడీఎన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి.వీటిలో పనాచే డిజిటల్ లైఫ్, కేన్స్ టెక్నాలజీ, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ తొలిసారి భారత్‌లో ల్యాప్‌టాప్‌ల తయారీలోకి ఎంటరవుతున్న సంస్థలు కావడం గమనార్హం. ఇంటెల్ తీసుకున్న నిర్ణయంపట్ల కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని సంస్థలు మేకిన్ ఇండియా దిశగా అడుగులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటెల్ తాజా నిర్ణయం ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా ప్లాన్‌కు నెల గ్యాప్‌లో రెండవ ప్రధాన ప్రోత్సాహం కావడం విశేషం. అక్టోబర్‌లో.. గూగుల్ భారతదేశంలో తన తాజా ఫ్లాగ్షిప్ పిక్సెల్ 8 ఫోన్ల తయారీని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ క్రమంలో భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో పాటు.. భారత్ ఎఫ్ఐహెచ్, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో గూగుల్ చర్చలు జరుపుతోందని సమాచారం. అలాగే.. మరో దిగ్గజ సంస్థ యాపిల్ సైతం ఐఫోన్ 15 సిరీస్ విషయంలో మేక్ ఇన్ ఇండియా దిశగా అడుగులు వేసిన విషయం కూడా తెలిసిందే.
ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ సందర్భంగా సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్లను ప్రవేశపెట్టింది. ఈ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్ 15 ప్రో మాక్స్ లోని కెమెరాతో షూట్ చేసింది. ఆ వీడియోను మ్యాక్‌లో ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ మొత్తాన్ని ఐఫోన్‌తో షూట్ చేసింది. గత నెలలో, ఆపిల్ వండర్లస్ట్ ఈవెంట్లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్ని ఆవిష్కరించింది. 48MP ప్రైమరీ సెన్సార్‌తో ఉన్న ఈ ఐఫోన్ కెమెరా ఈవెంట్ సమయంలో చాలామంది యూజర్ల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల నిర్వహించిన స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌తో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కెమెరాతో మరోసారి నిరూపించింది. ఆపిల్ ఎలా షూట్ చేసిందో వీడియోను కూడా కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట్లో ఈ వీడియోను ప్రైవేటులో పెట్టిన ఆపిల్ కొన్ని గంటల తర్వాత మళ్లీ లైవ్ చేసింది.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆదాయపు శాఖ ఇస్తున్న పాన్ కార్డ్స్ పొందుతున్నారు. బ్యాంకు సేవలు మొదలుకొని.. షాపింగ్, ప్రభుత్వ పథకాల కోసం పాన్ కార్డ్స్ ఉపయోగపడుతున్నాయి. అయితే ఒకవేళ పాన్ కార్డ్ పోతే అప్పుడు ఏం చేయాలి? డూప్లికేట్ పాన్ కార్డు ఎలా వస్తుంది? ఎన్ని రోజులు పడుతుంది? మరి అప్పటికప్పుడు అత్యవసరంగా పాన్ కార్డ్‌తో ఏదైనా అవసరం వస్తే ఎలా.? పాన్ కార్డు పోయిన సందర్భాల్లో సులభంగా ఇ-పాన్ కార్డ్ పొందొచ్చు. అదికూడా కేవలం 10 నిమిషాల్లోనే. ఇందుకోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో పాన్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ పోయినా, పాడై పోయినా వారి కోసం ఆదాయపు శాఖ ఈ- పాన్ పొందే అవకాశం కల్పించింది. ఇదంతా కూడా చకచకా జరిగిపోతుంది. ఈ రోజుల్లో పాన్ కార్డ్ అనేది అందరికీ మస్ట్ అయింది.
Read Also..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వరుసగా ఫీచర్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. తక్కువ ధరతో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ కంపెనీ జియో ఫోన్ ప్రైమా 4జీ పేరుతో మరో ఫోన్ ను విడుదల చేసింది. దీపావళికి అందుబాటులోకి రానుంది. జియో ఫోన్ ప్రైమా 4జీ ఫోన్ 2.4 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లేతో పనిచేస్తుంది. ఫ్లాష్ లైట్, కెమెరా సదుపాయం ఉండటంతోపాటు 512 ఎంబీ ర్యామ్ ఉంది. మెమొరీ కార్డుద్వారా దీన్ని 128 జీబీకి పెంచుకోవచ్చు. kaiOSపై ఇది పనిచేస్తుంది. ఆర్మ్ కోర్టెక్స్ ఏ 53 ప్రాసెసర్ తో వస్తోంది. బ్లూటూత్ 5.0, 1800 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు ఎఫ్ ఎం రేడియో సౌకర్యం ఉంది. జియో టీవీ, యూట్యూబ్, జియో సినిమా, సియో న్యూస్, జియో సావన్ వంటి యాప్స్ ఉచితంగా ఇన్ స్టాల్ చేసి వస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడంతోపాటు మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీపావళి సమయానికి ఈ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి. జియో భారత్ పేరుతో ఇటీవలే కొన్ని ఫోన్లను జియో తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.999 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజాగా యూపీఐ సదుపాయంతో జియో భారత్ బీ1 4జీ విడుదల చేసింది. దీని ధరను రూ.1299గా నిర్ణయించారు. అమెజాన్, జియో ఔట్ లెట్స్ లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ79 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను అమ్మకానికి తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 కాగా ప్రస్తుతం పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ. 15 వేలకే సొంతం చేసుకోవచ్చు. 90Hz రిఫ్రెష్ రేట్, 6150నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక బ్యాటరీన విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇన్డిస్ప్లేగా అందించారు.
గూగుల్ తాజాగా ‘అబౌట్ థిస్ ఇమేజ్’ అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆన్లైన్లో కనిపించిన ఏదైనా ఇమేజ్ క్వాలిటీ, కచ్చితత్వాన్ని వెరిఫై చేసుకోవడానికి ఈ స్పెసిఫికేషన్‌ను యూజర్లు వినియోగించవచ్చు. టెక్ దిగ్గజం గూగుల్ (Google) యూజర్ల కోసం చాలా సేఫ్టీ టూల్స్ అందిస్తుంది. ఇంటర్నెట్లో ఇమేజ్‌లు మార్చేసి యూజర్లను మానిప్యులేట్ చేసే కేటగాళ్లు చాలామంది ఉంటారు. ఇలాంటి ఇమేజ్‌లోని కాంటెక్స్ట్, కంటెంట్ క్రెడిబిలిటీని చెక్ చేయడం తలకు మించిన భారంగా మారుతుంది. వివిధ వెబ్సైట్లలో ఇమేజ్ ఆరిజిన్, మెటాడేటా, యూసేజ్ వంటి వివిధ డీటైల్స్ వినియోగదారులకు చూపడం ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది.యూజర్లు గూగుల్ ఇమేజెస్ రిజల్ట్స్‌లోని ఇమేజ్ త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి “అబౌట్ థిస్ ఇమేజ్ ” ఆప్షన్ పైన నొక్కాలి. అప్పుడు ఆ ఇమేజ్ ఎంత కాలం నాటిది? ఏయే సైట్స్ లో కనిపించింది వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. సెర్చ్ రిజల్ట్స్‌లోని ఈ ఫలితాల గురించిన టూల్లో “మోర్ అబౌట్ థిస్ పేజీ”పై క్లిక్ చేయడం ద్వారా ఫీచర్‌ని కూడా యాక్సెస్ చేయవచ్చు.
చలికాలం ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది వేడినీళ్ల కోసం గీజర్లు, వాటర్ హీటర్లు ఉపయోగిస్తారు. హీటర్ల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది చాలా ప్రమాదంతో కూడుకొన్నది. కొంచెం ఏమరపాటుగా ఉన్నా ఎలక్ట్రిక్ షాక్ కి గురికావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనిని వాడేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటర్ హీటర్ రాడ్లు చాలా కాలం పాటు పనిచేస్తాయి. సాధారణంగా ఎటువంటి సమస్య లేకుండా 5 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. అయితే 2 సంవత్సరాల తర్వాత వాటర్ హీటర్ రాడ్‌ని ఉపయోగించడం వల్ల ప్రమాదం నెలకొని ఉంది. ఇది విద్యుత్ షాక్‌కు కారణం అవుతుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రజలు స్థానిక వాటర్ హీటర్లను కొనుగోలు చేస్తారు. కానీ అది కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ కాకుండా ఒరిజినల్ కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. రాడ్‌ని బకెట్లో పెట్టిన తర్వాతే ఆన్ చేయాలి. ముందుగా స్విచ్ ఆన్ చేస్తే కరెంటు షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వాటర్ హీటర్ రాడ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. నీటిలో ఉన్నప్పుడు రాడ్ దెబ్బతింటుంది. మురికి పేరుకుపోవడం వల్ల నీరు ఆలస్యంగా వేడెక్కుతుంది. ఈ పరిస్థితిలో ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఇనుప బకెట్లలో ఎలక్ట్రిక్ రాడ్లు వాడకూడదు. ఇలా చేయడం వల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇందుకోసం ప్లాస్టిక్ బకెట్లే బెస్ట్ అని చెప్పొచ్చు.