ఈ ఏడాది జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. జులై 18న మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేసింది. ఆగస్ట్ 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడుతాల్లో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత నిధులను ఖమ్మం సభలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో మొత్తం రుణాలు తీసుకున్న రైతులు 32 లక్షల 50 వేల మంది ఉన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31 వేల కోట్ల రుణమాఫీకి అవసరం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. జులై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం నిర్వహించింది. లక్ష నుంచి లక్షా 50 వేల వరకు రుణాలున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మూడో విడతలో లక్షా 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. ఇక 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు విడుతాల్లో దాదాపు 12 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడతలో రుణమాఫీ చేయడానికి 6 లక్షలకు పైగా రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వాటికి దాదాపు 6 వేల నుంచి 7 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ బ్యాంకర్లు పెట్టిన మెలికలతో చాలామంది రైతులకు రుణమాఫీ అవ్వక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం బ్యాంకర్లకు సూచనలు చేయనుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 196852