తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలను కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు ను నడిపేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు ప్రారంభ తేదీ వివరాలతో త్వరలోనే ద మ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం 8.45 గంటలు. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.50కి విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2.35కి బయల్దేరి రాత్రి 11.20కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం నగరాలు.. ఏపీలో విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.
Tag:





Total views : 80402