ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’ ఖాతాను ఆగంతుకులు హ్యాక్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైం ఐజీ రవికృష్ణతో మాట్లాడారు మంత్రి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..ఉద్దేశపూర్వకంగానే హ్యాక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె అకౌంట్ నుంచి అనధికారిక పోస్టులు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఖాతాలో వస్తున్న పోస్టులను అధికారిక సందేశాలుగా పరిగణించవద్దని హోంమంత్రి కార్యాలయం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో ఫోన్లో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఈ హ్యాకింగ్ జరిగినట్లు భావిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఖాతా రికవరీకి చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
Tag: