చైనాలో శ్వాసకోశ సంబంధిత కేసుల పెరుగుదలపై న్యూఢిల్లీలోని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడు తాజాగా స్పందించారు. చలికాలంలో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమేనని, కొవిడ్ తరహాలో మరో సంక్షోభానికి అవకాశమే లేదని మాత-శిశు విభాగం అధిపతి డా. ఎస్కే కాబ్రా భరోసా ఇచ్చారు. ఇటీవల కాలంలో చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో నిమోనియా తరహా శ్వాసకోశ వ్యాధి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న విషయం తెలిసిందే. ఇది కరోనా సంక్షోభం లాంటి పరిస్థితికి దారి తీస్తుందన్న ఆందోళన నడుమ డా.ఎస్కే కాబ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్, నవంబర్ కాలంలో చైనాలో అకస్మాత్తుగా చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి కేసులు పెరిగాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ కేసుల్లో మైకోప్లాస్మా కనిపించింది కానీ కొత్త, అసాధారణ వైరస్లు ఏవీ బయటపడలేదు. కొత్త వ్యాధికారక జీవి వచ్చిందనేందుకు సంకేతాలేవీ లేవు. మరో కొవిడ్ తరహా సంక్షోభం వస్తుందని చెప్పేందుకు ప్రస్తుతం అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చలికాలంలో కనిపించే సాధారణ వైరస్‌లే చైనా కేసుల్లో బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
Viral Infections
ఆత్రేయపురపు వంగ, ముండ్ల వంగ, కస్తూరి వంగ, నీటి వంగ, గుత్తి వంగ ఇలా రకరకాల వంకాయలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వంకాయలతో ఎన్నో రకాల వంటలు చేస్తారు. అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వంకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే వంకాయలను వారంలో కనీసం రెండు సార్లు అయినా తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వంకాయల వల్ల మరో ప్రయోజనం ఏంటంటే. శరీరంలో కొవ్వులను కరిగించే శక్తి వీటిలో సమృద్ధిగా ఉంది.బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా వారంలో రెండు సార్లు వంకాయలను తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా, వంకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో షుగర్ లెవల్స్‌ను కూడా వంకాయలు కంట్రోల్ చేయగలవు.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ‘పంచ తులసి’ ఇప్పుడు మరింత ఆకర్షణీయ ప్యాక్‌లో లభిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే వెైరల్ ఇన్ ఫెక్షన్స్, దగ్గు, జలుబు, విషజ్వరాలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఇది రక్షణ కల్పి స్తుంది. దీర్ఘకాలంగా మధు మేహంతో, రక్తపోటుతో బాధపడుతున్న వారికి పంచ తులసి ఉపశమనం అం దించడంతో పాటు వ్యాధి పెరగకుండా ఉండేందుకు, రక్తశుద్ధికి దోహదపడు తుందని సంస్థ పేర్కొంది. దీన్ని నీటిలో కలుపుట వలన నీరు పరిశుభ్రం కావడంతో పాటు నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ట్యూబర్‌కులోసిస్‌గా కూడా ఉపయోగపడుతుంది. తాగే ప్రతిసారి గ్లాసు నీటిలో ఒక చుక్క పంచతులసి కలిపి తాగడం వల్ల కుటుంబమంతటికీ రోగనిరోధక శక్తి పెంపొందించి రక్షణ కల్పిస్తుంది. అన్ని కాలాల్లోనూ దీన్ని వాడవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పద్మావతి ఫార్మస్యూటికల్స్ (హరిద్వార్) తయారు చేస్తున్న ‘పంచతులసి’ని రిచ్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేస్తోంది.
Read Also..
Read Also..





Total views : 78338