తెలంగాణకు చల్లని కబురుతో పాటు కీలక హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు పడుతున్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#weatherupdates
పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట మధ్యాహ్నం కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని సూచిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 30 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వాటికి యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి