Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది..

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది..

by CVR NEWS

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్‌ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను రేపు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు నిర్ణయించారు. జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగియడంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఇంటర్‌ బోర్డు ప్రయత్నిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: