Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News తెలంగాణలో VOAల ఆందోళనలు ఉధృతం..

తెలంగాణలో VOAల ఆందోళనలు ఉధృతం..

by CVR NEWS
తెలంగాణలో VOAల ఆందోళనలు ఉధృతం

తెలంగాణలో ఉద్యోగ సంఘాల ఆందోళనలు రోజురోజూ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో, విలేజ్ ఆర్గనైజషన్ అసిస్టెంట్స్ కూడా తమ హక్కుల కోసం ముందుకొచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబ్ పేట్ మండలం లో VOAలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డెక్కారు. VOAలను గ్రామ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాల ఆర్థిక బలోపేతానికి కీలకంగా చెబుతారు . ఈ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తారు. దింతో గ్రామీణ ప్రాంతాల్లో వారి పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా మారింది . VOAల పని స్వభావం , బాధ్యతలు గ్రామీణాభివృద్ధిలో వాళ్ళ పాత్రను పరిగణనలోకి తీసుకుంటే వారి సేవలు ఎంతో కీలకమని తెలుస్తుంది .అందరు ఉద్యోగుల మాదిరి VOAలకు కూడా సమస్యలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు.

VOAలు ప్రధానంగా పని భారం, వేతన సమస్యలు, భద్రత , ఇతర వనరుల అందుబాటు కోసం ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, PF సౌకర్యం, జీతాలు నేరుగా సొంత ఖాతాల్లో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పనిభారం తగ్గించాలని , ID కార్డు, ట్యాబ్ లాంటి సాంకేతిక పరికరాలు అందించాలని కోరుతున్నారు. VOAల వర్క్‌లోడ్ పెరిగిపోతుండటం, తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో గ్యారంటీ లేకపోవడం వంటివి వారిని రోడ్డెక్కించడానికి ప్రధాన కారణాలు అని తెలుస్తుంది . ఈ డిమాండ్లు సక్రమంగా నెరవేర్చడం ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా, ప్రజలకు తగిన విధంగా చేరతాయని అంటున్నారు .సమానత్వం, ఉద్యోగ భద్రత, అవినీతిరహిత వేతన విధానం కోసం VOAల ఆందోళన జరుగుతుంది .

VOAల ఆందోళనలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనిచెప్పొచు . వారు గ్రామీణాభివృద్ధిలో సక్రమంగా పని చేస్తూ, పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. కానీ, ఉద్యోగ భద్రత, సమాన వేతనం, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ వంటి డిమాండ్లకు స్పందించకపోతే, ఈ ఆందోళనలు మరింత పెద్ద ఎత్తున ఉంటాయని VOAలు హెచ్చరిస్తున్నారు . VOAల సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామీణ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయని అంటున్నారు. ఇక VOAల సమస్యలు పరిష్కారమైతే గ్రామీణాభివృద్ధికి వారి సేవలు మరింత దోహదపడే అవకాశం ఉంది . ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఈ డిమాండ్లకు స్పందిస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి ..

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018645
Total views : 89069

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.