Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Crime హైదరాబాద్ మాసబ్‍ట్యాంక్ ప్రమాదంలో అడ్వకేట్ మృతి …

హైదరాబాద్ మాసబ్‍ట్యాంక్ ప్రమాదంలో అడ్వకేట్ మృతి …

by CVR NEWS
హైదరాబాద్ మాసబ్‍ట్యాంక్ ప్రమాదంలో అడ్వకేట్ మృతి

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర కారు దాడికి గురైన అడ్వకేట్‌ ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. నిందితులు కారుతో ఢీ కొట్టి ప‌రారైన అనంత‌రం కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఐతే ఈ ఘటనలో తీవ్రగాయాల‌పాలైన మొయినుద్దీన్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదు చేయ‌గా త‌ర‌వాత హ‌త్య కేసుగా మార్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాంపల్లి పోలీసులు కారు నంబర్ ట్రేస్ చేస్తున్నారు. భూ వివాదాల కార‌ణంగానే నిందితులు మొయినుద్దీన్ ను హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మొయినుద్దీన్ వ‌క్ఫ్ బోర్డు భూముల ర‌క్షణ కోసం పోరాడుతున్నట్టు తెలుస్తోంది. న్యాయ‌వాదిపై జ‌రిగిన దాడికి సంబంధించిన విజువల్స్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు కాపు కాచి న్యాయవాదిని కారుతో ఢీ కొట్టినట్టు సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతోంది. దీంతో న్యాయవాదులు తమ రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ న్యాయవాదులపై ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018663
Total views : 89126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.