Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Devotional ఘ‌నంగా కుమార‌ధార తీర్థ ముక్కోటి…

ఘ‌నంగా కుమార‌ధార తీర్థ ముక్కోటి…

by Prakash
ttd news - Kumaradhara Tirtha Mukkoti...

తిరుపతి(TTD News),

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శ‌నివారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. మాఘ మాసంలో పూర్ణిమనాడు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి, స్నానమాచరిండాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

Follow us on :Facebook, Instagram&YouTube.

ఈ సంద‌ర్భంగా భ‌క్తులు కొండ‌మార్గాల్లో సౌక‌ర్య‌వంతంగా న‌డిచేందుకు వీలుగా ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల అధికారులు త‌గిన ఏర్పాట్లు చేశారు. వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ధ‌ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ‘ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందారు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


స్వామివారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు.
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వార్షిక …
తిరుమలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
తిరుమల శ్రీవారి భక్తుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. …
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని ప్రముఖ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని …


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: