యూపీఎస్సీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది.. ఈ ఏడాది సివిల్స్ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. రెండో స్థానంలో రాజేశ్వరి సువే నిలిచారు, మూడో ర్యాంక్ ఆకాన్ష్ ధుల్‌కు దక్కింది. నాలుగో ర్యాంక్ రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సృజన 55వ ర్యాంక్, డీఎస్‌కే ప్రచేత్ 193వ ర్యాంక్, ఎస్. వర్షిత్‌రెడ్డి 259వ ర్యాంక్, ఎం. పవన్‌కుమార్‌రెడ్డి 297వ ర్యాంక్, వి. విక్రమసింహారెడ్డి 541వ ర్యాంక్, గుమ్మల శ్వేత 573వ ర్యాంక్, పోతుపురెడ్డి భార్గవ్ 537వ ర్యాంక్, పుడారి రాహుల్ 748వ ర్యాంక్, కత్తిమాని అనిరుధ్ 786వ ర్యాంక్, కోరపాతుల శ్రీకర్ రాజు 806వ ర్యాంక్, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష 823వ ర్యాంక్, కట్టా ప్రత్యూష 908వ ర్యాంక్, గోగుల రాజశేఖర్ 920వ ర్యాంక్, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంక్ సాధించారు. ఈ సంవత్సరం తెలుగు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ అద్భుత పనితనం కనబరిచారు.
యూపీఎస్సీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది.
181





Total views : 47789