Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh అమరావతిలో రోడ్ల నిర్మాణం – తక్షణమే ఆపాలన్న ఏపీ హైకోర్టు

అమరావతిలో రోడ్ల నిర్మాణం – తక్షణమే ఆపాలన్న ఏపీ హైకోర్టు

by Satya
AP High Court

మంగళగిరి మండలం నిడమర్రులో రోడ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని నగరపాలక సంస్థతోపాటు, సీఆర్‌డీఏను హైకోర్టు ఆదేశించింది. అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా నిడమర్రులో తమకు కేటాయించిన ప్లాట్లలో అధికారులు రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫున న్యాయవాది లక్ష్మీనారాయణ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే నిర్మాణ పనులను ఆపేయాలని అధికారులను ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని ఆదేశించింది.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: