Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home International అమెరికాలో భారీ హిమపాతం..

అమెరికాలో భారీ హిమపాతం..

by CVR NEWS

అమెరికాలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. దీనికి తోడు బలమైన గాలులు వణికిస్తున్నాయి. న్యూయార్క్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. న్యూయార్క్‌ నుంచి మసాచుసెట్స్‌ వరకు భారీ మంచు తుపాను విరుచుకుపడింది. దీంతో రోడ్లు, ఇళ్లు, దుకాణాలు, పార్క్‌లు, మైదానాలు ఇలా ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. మంచు తుపాను ధాటికి వాహనాల్లో ప్రయాణాలపై అధికారులు నిషేధం విధించారు. 5వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్‌ పరిధిలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ స్థాయిలో న్యూయార్క్‌ నగరాన్ని మంచు తుపాను చుట్టుముట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. ఇక న్యూజెర్సీలో 1996 తర్వాత ఇంతటి స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు స్థానికులు. న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌ మాక్‌ ఆర్థర్‌ ఎయిర్‌పోర్టులో 22.5 అంగుళాల దట్టమైన మంచు కురిసినట్టు వెల్లడించారు అధికారులు. గంటకు 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మంచు తుపాను హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకున్నారు. న్యూయార్క్ సిటీ, ఫిలడెల్ఫియాతో పాటు డెలావేర్ నుంచి మసాచుసెట్స్ వరకు పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: