Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News ఈపీఎఫ్ఓ అన్ క్లైమ్డ్ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్నయం..

ఈపీఎఫ్ఓ అన్ క్లైమ్డ్ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్నయం..

by CVR NEWS

ఈపీఎఫ్‌ఓలో ఎవరూ క్లెయిమ్‌ చేయని మొత్తాలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యనిధి సంస్థ వద్ద ఉన్న మొత్తాలను ఆయా చందాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. దీనితో 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తొలి దశలో 7 లక్షల మంది చందాదారులు లబ్ధి పొందనున్నారు. దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.ఈ మేరకు నిర్ణయం ఈపీఎఫ్‌ఓలో సమీక్షా సమావేశంలో తీసుకున్నారు.మొత్తం 31.86 లక్షల ఖాతాలు నిర్వహణలో లేకుండా ఉన్నట్లు ఈపీఎఫ్‌ఓ గుర్తించింది. ఇందులో రూ.10,903 కోట్ల మేర నిల్వలు ఉన్నాయన్నది అంచనా. ఇందులో 7.11 లక్షల ఖాతాల్లో రూ.1000 మాత్రమే నగదు నిల్వలు ఉన్నట్లు ఈపీఎఫ్‌ఓ గుర్తించింది. ఈ ఖాతాల్లోని నగదు విలువ రూ.30.52 కోట్లుగా ఉంది. సాధారణంగా మూడేళ్లు పైబడి ఎలాంటి లావాదేవీలు లేని వాటిని నిర్వహణలో లేని ఖాతాలుగా గుర్తిస్తారు. ఇలాంటి మొత్తం ఇన్‌ ఆపరేటివ్‌ ఖాతాల్లో కొన్ని 20 ఏళ్లకు పైబడినవి కూడా ఉన్నాయి.పైలట్‌ ప్రాతిపదికన తొలుత 7 లక్షల ఖాతాల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆధార్‌తో అనుసంధానం అయ్యి ఉన్న బ్యాంకు ఖతా, ఈపీఎఫ్‌ఓ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా ఈ నగదును వేయనున్నారు. దీనికి ఎలాంటి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ డాక్యుమెంట్లు గానీ, డాక్యుమెంట్లు గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం అయితే మిగిలిన 25 లక్షల నిస్తేజ ఖాతాలకు ఆటోమేటిక్‌ రిఫండ్‌ విధానాన్ని అనుసరించనున్నారు..

Advertisements

You may also like

Our Visitor

019153
Total views : 90018

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.