Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home International శవాల దిబ్బగా నేపాల్.

శవాల దిబ్బగా నేపాల్.

by CVR NEWS

నేపాల్‌లో సంభవించిన విపత్తుతో ఆ దేశం కనీవినీ ఎరగని నష్టం చవి చూసింది. కళ్ల ముందు అప్పటి వరకు కళకళ లాడిన ప్రదేశం ఇపుడు శ్మశానాన్ని తలపిస్తుంది. బురద మొత్తం మేట వేయడంతో అందులో చిక్కుకొని ఎంతో మంది కన్నుమూసారు. తీసే కొద్ది శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ విలయంలో పలు దేశాలకు చెందిన భారతీయులున్నారు. ఈ విలయం తర్వాత ఇంకా ఆచూకి తెలియని వారి సంఖ్య భారీగానే ఉంది. ఈ విపత్తు సంభవించిన సమయంలో అక్కడున్న వారు బతికి ఉండే అవకాశాలు లేవని అక్కడి సైన్యం చెబుతుంది.
ఈ ఘటనలో గల్లంతైన వారి విదేశీ టూరిస్టులు దాదాపు 517 మంది దాకా ఉన్నారు. వీరిలో భారత సంతతి వారే 370 మంది దాకా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పియిన వారి సంఖ్య 939 కి పెరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక భారీ విపత్తుకు కారణమైన భోటే కోశి నదిలో అంతకంతకు బురదతో పాటు నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో సైన్యం, విపత్త నిర్వహణ సంస్థకు చెందిన వాళ్లు సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ 1924 మంది గల్లంతు అయినట్టు చెబుతున్నారు. మరోవైపు అక్కడి సైనిక సిబ్బంది 4451 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రక్షణ బృందాలు విపత్తు సంభవించిన ప్రదేశంలో పూర్తిగా గాలిస్తు చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు. అయితే రక్షణ బృందాలు వెలికి తీసేకొద్ది గుట్టలకొద్ది శవాలు దర్శనమిస్తున్నాయి. మొత్తంగా విపత్తు తర్వాత ఆ ప్రాంతం మహా శ్మశానాన్ని తలపిస్తుంది. మరోవైపు నేపాల్‌కు సహాయంగా భారత ప్రభుత్వం కూడా సైనిక, ఆర్ధిక, ఇతరత్రా అన్ని రకాల సాయం అందిస్తోందిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: