దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు మంగళవారం పెంచాయి. వివిధ నగరాల్లో స్వల్ప తేడాతో వీటి ధరలు పెంచాయి. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర పదకొండు రూపాయలు పెరిగి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలకు చేరుకుంది. ఇక ఏపీలో కూడా పదకొండు రూపాయలు పెరిగి రెండు వేల తొమ్మిది వందల ముప్పయి రెండు రూపాయలకు చేరింది. ఢిల్లీలో తొమ్మిది రూపాయల యాభై పైసలు పెరిగి రెండు వేల ఏడువందల నలభై ఏడు రూపాయలకు చేరింది. ముంబైలో రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలకు చేరింది. చెన్నైలో కూడా రెండు వేల తొమ్మిది వందల ఆరు రూపాయల నుంచి రెండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలకు చేరింది. అంటే అక్కడ ఒక్క సిలిండర్‌పై పది రూపాయల యాభై పైసల అదనపు భారం పడింది. ఇతర నగరాల్లోనూ ధరల్లో మార్పులు నమోదయ్యాయి. గురుగ్రామ్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేల ఏడువందల అరవై నాలుగు రూపాయలకు చేరింది. నోయిడాలో రెండు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలకు పైగా పెరిగింది. లక్నోలో ఇదే ధర కొనసాగుతోంది. పాట్నాలో మూడు వేల నలభై నాలుగు రూపాయలకు చేరింది. ఆయా ప్రాంతాల్లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.
36