తిరుమలలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 6న ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తి స్థాయి ఈవోగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆలయ వ్యవహారాలపై సమగ్ర అవగాహన పెంచుకున్నట్లు ఆయన తెలిపారు.సామాన్య భక్తుడిగా ఆలోచిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో స్వయంగా పరిశీలనలు నిర్వహిస్తానని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా, సౌకర్యవంతమైన దర్శనం అందేలా, అలాగే నాణ్యమైన ప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా టీటీడీ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
240
previous post





Total views : 89808