Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.

by CVR NEWS

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైనా పడుతోంది. పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ దొరకడంలేదన్న పుకార్లతో బంకుల ముందు బారులు తీరుతున్నారు. దీంతో పెట్రోల్‌ బంకుల దగ్గర భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అనేక బంకులు ఇప్పటికే ‘నో స్టాక్’ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్టాక్ ఎప్పుడు అయిపోతుందో అన్న ఆందోళనతో వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. బంకుల బయట రోడ్ల మీదకే వాహనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039474
Total views : 196996

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: