Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా

బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా

by Rama
బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా

బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ నుంచి గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా చేశారు. తంగళ్ళపల్లి మండలం బద్దనపల్లిలో టెక్స్ టైల్ పార్క్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన కార్మికులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ నినదించారు.గత ప్రభుత్వం యారన్ సబ్సిడీ ఒక మీటరుకు 1 – 42 పైసలు ఇవ్వగా, ఈ ప్రభుత్వం కేవలం 30 పైసలకు తగ్గించడం దుర్మార్గం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమానికి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ . . . ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాల మేలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబించడం దుర్మార్గమని, కార్మికులకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అయితే తగ్గించిన యారన్ సబ్సిడీని గతంలో ఇచ్చిన మాదిరిగా ఒక మీటరు 1 – 42 పైసలు కార్మికులందరికీ వెంటనే అందించాలని మరియు ఇతర సంక్షేమ పథకాలను కూడా యధావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా రెండు, మూడు రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని, అవసరమైతే టెక్స్ టైల్ పార్కులో విధులను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ , అక్కల శ్రీనివాస్ , జెల్ల సదానందం , సుంకటి మహేష్ , దూస రాజమల్లు , మేఘ ఆంజనేయులు , దూడం సంపత్ , రాజశేఖర్ , రమేష్ , శ్రీకాంత్ , శ్రీనివాస్ , వెంకటేష్ , భాస్కర్ , రాజశేఖర్ , కుమార్ , నరేష్ , అంబదాస్ , రంగయ్య , వేణు , అశోక్ , రాజేష్ , కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019170
Total views : 90053

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.