Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతలకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

వైసీపీ నేతలకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

by Rama
వైసీపీ నేతలకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

ధర్మవరంలో ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలు చేశారని.. వీటిన్నింటికీ ఇప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుందని టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 28 వ వార్డులో వాటర్ ట్యాంక్, సిద్దయ్యగుట్టలోని సాయిబాబా వాటర్ ట్యాంక్, ఎల్.పి.సర్కిల్లోని అన్న క్యాంటీన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంపై శ్రీరామ్ ఆరా తీశారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే ఐదేళ్లుగా మూతపడ్డ అన్న క్యాంటీన్ల పరిస్థితిని స్వయంగా చూశారు. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోయాయి ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. అలాగే పేద ప్రజలకు తక్కువ ధరకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పై కక్షతో ప్రజలకు పెట్టే భోజనాన్ని దూరం చేశారన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుల వారిగా సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న దానిపై ఒక సమీక్ష చేసుకుని మంత్రి సత్యకుమార్ సహకారంతో వాటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. మరోవైపు తాము ఎక్కడ అభివృద్ధి చేస్తామోనన్న భయంతో వైసీపీ నాయకులు వారి పత్రిక ద్వారా విషం చిమ్మిస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు మున్సిపల్ స్థలాలు కబ్జా చేసి, ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసిన వారిని ఊరికే వదిలేదిలేదన్నారు. వాటిన్నింటిపై చర్యలు ఉంటాయన్నారు. ఇన్ని రోజులు స్వైర విహారం చేసి.. ఇప్పుడు కూడా అలాగే ఉంటామంటే.. ఊరుకునేది లేదన్నారు. ఆరోజు ధర్మవరంలో ప్రశాంతత కోసం పరిటాల రవి కృషి చేశారని.. ఇప్పుడు కూడా తాము ప్రశాంతత కోసం పని చేస్తామన్నారు. వైసీపీ నాయకులు వారి హద్దుల్లో ఉంటే బాగుంటుందని.. అలా కాదంటే మా నుంచి ప్రతి సమాధానం కూడా ఉంటుందని హెచ్చరించారు…..

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197062

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: