ముస్లీంలకు నిజమైన శతృవు కాంగ్రెస్ పార్టీ అని, ముస్లీం సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో నిర్వహించిన రోడ్ షో లో కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. ముస్లీంల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని తెలిపారు. ఆ పార్టీ లౌకిక పార్టీ కాదని విమర్శంచారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతకల్లోలాలు జరుగుతున్నాయని, గతంలో మన దగ్గర కూడా కాంగ్రెస్ హయాంలో తరుచూ మతకల్లోలాలు, కర్ఫ్యూలతో భయంకరమైన పరిస్థితి ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మతకల్లోలం కూడా జరగలేదని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు, గురుద్వారలకు ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ ఒక్క మతం పట్ల తాము వివక్ష చూపకుండా పరిపాలించామని స్పష్టం చేశారు. తెలంగాణలో మతసామరస్యం ఇలాగే వర్ధిల్లాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని అన్నారు. “కార్ కా నిషాన్… తెలంగాణ కా షాన్ హై” అని వ్యాఖ్యానించారు.
ముస్లింలకు నిజమైన శత్రువు కాంగ్రెస్ – ఎమ్మెల్సీ కవిత
60
previous post