Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం..!

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం..!

by Satya
Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్… చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, చంద్రబాబును ఆలింగనం చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: