Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం

by Rama
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం

దక్షిణాకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికవరకు కేవలం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, లడ్డు తయారీలో నాణ్యత లోపం, శానిటేషన్ పై నిర్లక్ష్యం, బ్లాక్ లో టికెట్టు విక్రయం, సిబ్బంది చేతివాటం వంటి పలు విషయాల్లో వార్తలోకెక్కిన రాజన్న ఆలయం ఇప్పుడు ఏకంగా నకిలీ ధృవపత్రాల బాగోతంతో వార్తల నిలుస్తోంది. ఆలయంలో ఏ.ఈ.వోగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆలయాధికారులు సైతం సీనియర్లను కాదని, ఆయనకు పదోన్నతి కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించినట్టు గత కొన్నేళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలోనే కొంతమంది ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్ కు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పప్పటికి సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు మరికొంత మంది ఉద్యోగులు, సిబ్బంది సైతం నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కనీసం నూతన కాంగ్రెస్ ప్రభుత్వమైన నకిలీలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.
    రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…
  • ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.
    పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,…
  • తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
    తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…
  • నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.
    సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, వాటిపై చేపట్టిన చర్యలు, పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై…
  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: