Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Political సింగరేణి కొత్త గనులను కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్..

సింగరేణి కొత్త గనులను కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్..

by Rama
సింగరేణి కొత్త గనులను కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్..

సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు. సింగరేణి బొగ్గుతోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయన్నారు. సింగరేణికి మరిన్ని గనులు కేటాయించాలన్నారు.
ఎన్ఎండీఆర్ యాక్ట్‌కు ముందు బొగ్గు గనులపై సింగరేణికి పూర్తి అధికారం ఉండేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఎన్ఎండీఆర్‌లో కొత్త సవరణను చేపట్టిందన్నారు. 2015లోని ఎన్ఎండీఆర్ సవరణ ప్రకారం సింగరేణి తన హక్కులను కోల్పోయిందన్నారు. అదే సమయంలో బొగ్గు గనుల వేలంలో పాల్గొనడానికి గల కారణాన్ని చెప్పారు. బొగ్గు గనుల వేలాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వేలంలో పాల్గొన్నట్లు చెప్పారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: