అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది. అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ అన్నారు. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే చోట, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతోందని పేర్కొన్నారు. నీరు ఇదే విధంగా లీకేజీ అవుతుంటే లోపల కూర్చుని పూజ చేయడం కూడా ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు.అయోధ్య రామాలయం పైకప్పులో లీక్.. నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని, అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 197118