Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Main News హైదరాబాద్ లో స్నాచింగ్ ముఠాపై కాల్పులు

హైదరాబాద్ లో స్నాచింగ్ ముఠాపై కాల్పులు

by Rama
హైదరాబాద్ లో స్నాచింగ్ ముఠాపై కాల్పులు

హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపై గొడ్డలితో దాడికి మరో ఇద్దరు యత్నించారు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా..వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారు అనీస్, రాజ్‌గా గుర్తించారు. వీరితో పాటు ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.
    భవిష్యత్‌ న్యూక్లియర్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్‌ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్…
  • రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
    బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి…
  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014616
Total views : 80597

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.