ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళుకు రైల్వే శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. తొలి రైలును ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ – ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ నగరాల మధ్య రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు తాజాగా సూచించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు సికింద్రాబాద్ – పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు రానుంది.
తిరుపతి – నిజామాబాద్ మధ్య సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌లో ప్లాట్ ఫాం ఖాళీ లేక బోధన్‌కు తరలిస్తున్నారు. ప్రయాణ సమయానికి ముందు బోధన్ నుంచి నిజామాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఇక సికింద్రాబాద్ – రాజ్‌కోట్ మధ్య రాకపోకలు సాగించే రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్న రాజస్థానీలకు అత్యంత అనుకూలంగా మారింది. అయితే, ఈ రైలును కచ్ జిల్లా వరకూ పొడిగించాలని హైదరాబాదీలు కోరుతున్నారు. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలో చర్చకు రావడంతో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకూ, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను కచ్ వరకూ పొడిగించేందుకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపిస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి