మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తీజ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొని గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలని తీజ్ వేడుకల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి ఆడి పాడారు. బంజారా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్యాలు చేశారు. మహబూబాద్ జిల్లా గూడూరులో తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తీజ్ ఉత్సవాలు జరుపుకోవడం ఆనందనీయమని, సంస్కృతి సాంప్రదాయాలతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. ప్రధానంగా భక్తిభావంతో పెళ్లికాని యువతులు తొమ్మిది రోజులపాటు జరుపుకొంటారని, ప్రకృతితో మమేకమై మట్టిని, మొలకలను ఆరాధిస్తారన్నారు. ఈ పండుగను మా తాతల పూర్వకాలం నుంచి నిర్వహించుకోవడం ఆనవాయి తీగా వస్తోందని మురళీ నాయక్ అన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి