ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జన్మభూమి-2 ను ప్రారంభించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని, ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా చేపట్టాలని, త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించాలని, పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రభుత్వానికి ఇస్తున్న సమయాన్ని అంతే స్థాయిలో పార్టీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ ఘన విజయం ఇచ్చిన ప్రజలకు, ఎన్డీయే పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీలో త్వరలో జన్మభూమి-2 ప్రారంభంటీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పైరవీలకు తావులేకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పార్టీలో పెట్టి చర్చిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి