Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home International క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

by Rama
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

భారత జట్టు బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ధావన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోస్ట్ చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో భాగమైన శిఖర్ ధావన్, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. శిఖర్ ధావన్ ఇప్పుడు నా క్రికెట్ ప్రయాణంలో ఈ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాను అని క్యాప్షన్‌లో రాశాడు. లెక్కలేనన్ని జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నాను.క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు.. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ధావన్ మంచి గుర్తింపు సాధించాడు. అతను చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌లో భారత జట్టు తరపున ఆడాడు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: