Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని భారీ విరాళం

తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని భారీ విరాళం

by Satya
తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని భారీ విరాళం

భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన తెలుగు రాష్ట్రాల‌ బాధితుల‌ను ఆదుకునేందుకు సినీ, రాజ‌కీయ అనే తేడా లేకుండా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా 6కోట్ల భారీ విరాళంతో ఉదార‌త చాటారు. ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మ‌రో కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు ల‌క్ష చొప్పున‌ 4 కోట్లు ప్రకటించారు. ఇలా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గొప్ప మ‌న‌సు చాటిన ప‌వ‌న్‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా వ‌ర‌ద ప్రాంత ప్ర‌జ‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ డిప్యూటీ సీఎంను అభినందించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు భారీ విరాళం ఇవ్వ‌డం జ‌న‌సేనాని విశాల హృద‌యానికి అద్దం ప‌డుతుంద‌ని సీఎం కొనియాడారు. తెలుగు రాష్ట్రాల వ‌ర‌ద బాధితుల‌కు జ‌న‌సేనాని భారీ విరాళం. ప్ర‌జల‌కు ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు విలువ క‌ట్ట‌లేమ‌ని తెలిపారు. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ క‌ల్యాణ్‌ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరో సారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సీఎం చంద్ర‌బాబు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018665
Total views : 89129

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.