మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. అజ్ఞాతంలోకి వెళ్లిన సురేష్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడ ఉన్నారని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేశ్‌ను అదుపులోకి తీసుకుంది. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
- జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు…
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
- కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90341