Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National పరుగులు పెడుతున్న పసిడి ధర

పరుగులు పెడుతున్న పసిడి ధర

by Satya
పరుగులు పెడుతున్న పసిడి ధర

అలుపెరగకుండా పరుగులు పెడుతున్న పసిడి ధర . గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా 78 వేల రూపాయలతో ఆల్‌టైం హై నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై నిన్న 400 రూపాయలు పెరిగి 78 వేలకు చేరుకుంది. బంగారం ధరతోపాటు పెరిగే వెండిపైనా కిలోకు 1000 రూపాయలు పెరిగి 94 వేల రూపాయలను తాకింది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు. దసరా, దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం వుందని, రూ. 80 వేల మార్కును కూడా తాకవచ్చని విశ్లేషిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: