Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home National భారీ వర్షాలతో నేపాల్ లో అతలాకుతలం

భారీ వర్షాలతో నేపాల్ లో అతలాకుతలం

by Satya
భారీ వర్షాలతో నేపాల్ లో అతలాకుతలం

భారీ వర్షాలు నేపాల్ ను అతలాకుతలం . భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకుని మరణించినవారి సంఖ్య 170కి చేరుకుంది. 42 మంది గల్లంతయినట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు, మధ్య నేపాల్లోని పలు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా సంభవించిన వరదల వల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. వరదల కారణంగా 111 మంది గాయపడ్డారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరేల్ తెలిపారు. అన్ని భద్రతా సంస్థల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన 162 మందిని నేపాలీ సైన్యం విమానంలో తరలించింది. నేపాలీ ఆర్మీ, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాల సిబ్బంది వరదల్లో చిక్కుకున్న సుమారు 4 వేల మందిని రక్షించారని పోఖారెల్ వెల్లడించారు. రక్షించిన ప్రజలకు పునరావాసం కల్పించడంతోపాటు ఆహారం, సామగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..
    నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
  • హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..
    అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…
  • నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..
    నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా…
  • నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..
    నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిపాడు, జంగాల కండ్రిక గ్రామాల్లో భారీ గాలుల వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తలుపురుపాడు, తరుణవాయి, కొరిమెర్ల, జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి,…
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం గ్రామ శివారులో ఆదివారం భారీ వర్షం, ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి . బలమైన గాలుల ధాటికి ఓ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. సుమారు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019249
Total views : 90149

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.