ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి..ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానలతో స్థంభించిన అభివృద్ధి..కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఐదేళ్ల అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అమరావతికి భారీగా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు నవ రాజధానికి కోసం రూ.3 వేల 445 కోట్లు కేటాయించింది. ప్రధాన మౌలిక వసతులకు రూ.3,000 కోట్లు నిధులను సమకూర్చింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులకు రూ.400 కోట్లు, అమరావతి స్మార్ట్‌సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు రూ.32 కోట్లు, హైకోర్టు భవనంలో వసతుల కల్పనకు రూ.13.33 కోట్లును వెచ్చించనుంది. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా కొలిక్కి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం
బడ్జెట్ లభారీగా కేటాయింపులు చేయడంతో రాజధాని పనులు పరుగులు పెట్టబోతున్నాయి. అటు రాజధానికి సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసానివ్వడం, ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి రూ.15,000 కోట్ల రుణ ప్రక్రియ కొలిక్కి రావడం, రూ.12,000 కోట్లు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడంతో ఆర్థిక వనరుల లోటు తొలగిపోయింది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించిననాటి నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలను ఊరిస్తూనే ఉంది. 2014- 19ల మధ్య ప్రాథాన్యతను సంతరించుకున్న ఈ ప్రాజెక్టు 2019- 24 మధ్య వైసీపీ హయాంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. తాజా బడ్జెట్లో మెట్రో రైలు విభాగానికి రూ.50 కోట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పట్ల తన చిత్తశుద్ధిని ప్రకటించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి