Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని.

by CVR NEWS

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని…20 నెలలకు పార్టీలో మానసిక ఇబ్బందులకు గురి చేశారని మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తంది అని జీవన్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు. కొందరు నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అన్న సంతోషం కూడా లేకుండా చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్‌ తీరు, పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ కుమార్‌ను తీసుకున్న కారణంగానే మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ….ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అన్యాయమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే…తెలంగాణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేను అది కూడా తన సొంత నియోజకవర్గం నుంచి గెలుపొందిన వ్యక్తిని తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తనను ఎంతగానో బాధించింది అని మాజీమంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని జీవన్ రెడ్డి మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టార్జితమని అన్నారు. గత పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటారా? అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాలు జాతీయస్థాయిలో ప్రభావితం చూపబోతున్నాయని.. ‘జై భీమ్-జై సంవిధాన్-జై బాపు’ నినాదాలకు తూట్లు పొడిచారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడటం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు. గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని…ఆత్మగౌరవం లేని చోట ఇక కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ కూడా పదవుల కోసం వెంపర్లాడలేదు అని చెప్పుకొచ్చారు.అలాగని పదవుల కోసం ఎలాంటి పైరవీలు కూడా చేయలేదు అని చెప్పుకొచ్చారు. కార్యకర్తల గౌరవం కాపాడటమే తన ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. తాను తీసుకున్న నిర్ణయం పట్ల ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీమంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: