Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News నేడు మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నిక…

నేడు మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నిక…

by CVR NEWS

తెలంగాణ రాజకీయాలు మరోసారి హై వోల్టేజ్‌కి చేరుకున్నాయి. క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరిలో ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పోచవ్వను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు ఉండడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అలాగే, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల ఎన్నికలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. కౌన్సిలర్ల మధ్య తగాదాలు, కోరం లోపం, కొన్నిచోట్ల ఘర్షణల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 4న ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 5ని కూడా ప్రత్యామ్నాయ తేదీగా ఉంచారు.

Advertisements

You may also like

Our Visitor

009355
Total views : 61925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.