Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh చిత్తూరు జిల్లా మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష..

చిత్తూరు జిల్లా మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష..

by CVR NEWS

చిత్తూరు జిల్లాలో 2015లో జరిగిన మేయర్ దంపతుల హత్య కేసులో ఆరు నెలల క్రితం నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వ ఉద్యోగులు సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారు. వీరిలో 8 మంది వివిధ కారణాలు చూపుతూ సాక్ష్యం ఇవ్వకుండా తప్పించుకోగా, మరో 6 మంది తమ సాక్ష్యాన్ని మార్చినట్లు కోర్టు గమనించింది. సాక్ష్యం చెప్పని ఆ 14 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. నోటీసులకు సమాధానాలు సమర్పించినప్పటికీ, వారి వివరణలతో కోర్టు సంతృప్తి చెందలేదు. దాంతో ఆ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, సాక్ష్యాన్ని నిరాకరించడం మార్చడం వంటి చర్యలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ 14 మంది అధికారులపై ప్రైవేటు కేసు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.

Advertisements

You may also like

Our Visitor

039998
Total views : 202858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: