Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ..

ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ..

by CVR NEWS
ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.ఆర్టీసీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భట్టి… బీఆర్‌ఎస్‌ పాలనలో ఆర్టీసీ చిన్నాభిన్నమైందన్నారు. అప్పటి పాలకులు ఎంత కఠినంగా వ్యవహరించారో మీకందరికీ తెలుసు. గత పాలకుల మాదిరిగా మేము వ్యవహరించబోమని భరోసా ఇచ్చారు. ఆర్టీసీకి సంబంధించిన పాలన, విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామనీ.. కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందామని భట్టి అన్నారు.
()మొత్తం 32 డిమాండ్లను జేఏసీ నేతలు మంత్రుల ముందు ఉంచారు. ఇప్పటికే 29 డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రకటించిన నేపథ్యంలో.. మూడు కీలక డిమాండ్లపై మంత్రులు, జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు గుర్తింపు, పీఆర్‌సీపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బోర్డు పరిధిలోని సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులు పరిష్కరించుకోవాలని.. ప్రభుత్వ పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని మంత్రులు తెలిపారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. సీఎస్‌ రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్‌ వికాస్‌రాజ్‌ కూడా హాజరయ్యారు. డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి పట్ల మంత్రులు, జేఏసీ నేతలు సంతాపం ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శంకర్‌ గౌడ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు.ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. కార్మికులు ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలపాలని..ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్‌ అధికారుల కమిటీ సమావేశమైంది. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ నేతలు విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. జేఏసీ నేతల డిమాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..అప్పటి వరకు చర్చలు ఫలిస్తాయా? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: