Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Latest News అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో..

అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో..

by CVR NEWS
అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో

అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ ఫొటోతో ఉన్న పాస్‌పోర్టులను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమిత సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు ప్రకటించింది యూఎస్‌ విదేశాంగశాఖ. ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ట్రంప్‌..ఇప్పుడు అమెరికన్ పాస్‌పోర్టులపై కూడా తన ఫొటో, సంతకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో దశాబ్దాలుగా పాటిస్తున్న ఓ సంప్రదాయానికి తెరదించినట్టయింది. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక పాస్‌పోర్టులను విడుదల చేయనున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది.

‘అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు జులైలో జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్‌ పాస్‌పోర్టులు విడుదల చేసేందుకు విదేశాంగ శాఖ రెడీ అవుతోంది. ఈ పాస్‌పోర్టులకు ఎలాంటి అదనపు వసూళ్లు ఉండవని వెల్లడించింది విదేశాంగశాఖ. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది. అందులో ట్రంప్‌ ఫొటో..దాని కింద గోల్డ్‌ కలర్‌లో ఆయన సంతకం ఉంది. మరొక దానిలో యూఎస్‌ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటో ఉంది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009322
Total views : 61457

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.