Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పీఏ దారుణహత్య..

బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పీఏ దారుణహత్య..

by CVR NEWS
బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పీఏ దారుణహత్య

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ రథ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో గుర్తు తెలియని దుండగులు అతి దగ్గరి నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆయనమీద కాల్పులు జరిగాయి. బుల్లెట్‌ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారు. చంద్రనాథ్‌ సువేందుకు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి. దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుల కోసం గాలిస్తున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: