71
స్టాక్ మార్కెట్లు …ఫుల్ బ్రేకింగ్
వారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులు, రూపాయి విలువ పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 854 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 232పాయింట్లకు పైగా పతనమై కీలక స్థాయిల దిగువన ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది.






Total views : 75164