19
యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వయంగా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య దౌత్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోడీతో కలిసి దిగిన సెల్ఫీని జార్జియా మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోకు లక్షలాది లైక్స్, వేలాది కామెంట్లు వచ్చాయి. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.




Total views : 81759